![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1039 లో.. కాలేజీలో అటెండెన్స్ పర్సంటేజ్ తక్కువ అయిందని బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తారు. అసలు స్టూడెంట్స్ కాలేజీకి ఎందుకు రావడం లేదు వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటో ఎలా తెలియాలని ఫణీంద్ర అంటాడు. ఇప్పటివరకు కాలేజీలో ఇలాంటివి జరగలేదు. దీనికి సొల్యూషన్ ఆలోచించాలని బోర్డు మెంబర్స్ అంటారు.
ఆ తర్వాత కాలేజీకి రాని వారికి ఫైన్ అని చెప్తే వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా అని బోర్డు మెంబర్స్ సజెషన్ ఇస్తారు. అలా అందరు ఒక్కకొక్కరుగా ఒక్కో సొల్యూషన్ చెప్తుంటారు కానీ అవేమంత న్యాయంగా అనిపించవు. నా దగ్గర ఒక ఐడియా ఉంది అంటు వసుధార చెప్తుంది. స్కూల్ లో స్టూడెంట్స్ గురించి పేరెంట్స్ కు తెలియాలంటే.. పేరెంట్స్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేస్తారు కదా ఇలాగే కాలేజీలో కూడా పేరెంట్స్, లెక్చరర్ మీటింగ్ కండక్ట్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ కి బయపడి కాలేజీకు వస్తారు. ఇంట్లో కాలేజీకి అని చెప్పి రాని వారుంటారు కదా దీనివల్ల ఇంట్లో వాళ్ళకి స్టూడెంట్స్ కాలేజీకి వచ్చేది, రానిది తెలుస్తుందని వసుధార అనగానే.. మంచి ఐడియా అంటు బోర్డు మెంబర్స్ అందరు మెచ్చుకుంటారు. ఆ తర్వాత శైలేంద్ర కావాలనే మనుని బాధపెట్టాలని పేరెంట్స్ మీటింగ్ అంటే అందరికి పేరెంట్స్ ఉండరు కదా తల్లి ఉంటే తండ్రి ఉండరు, తండ్రి ఉంటే తల్లి ఉండరు కదా.. కొందరికి ఉన్నా వాళ్ళ పేరెంట్స్ ఎవరో కూడా తెలియదంటూ శైలంద్ర అంటుంటే.. మను కోపంగా గ్లాస్ ని చేత్తో గట్టిగా అనేసరికి అది పగిలిపోద్ది. వెంటనే మహేంద్ర.. ఎందుకిలా చేసావంటూ కర్చీఫ్ ని తన చేతికి కడతాడు. ఆ తర్వాత మను అక్కడ నుండి వెళ్లిపోతాడు.
ఆ తర్వాత అనవసర విషయాలు మాట్లాడుతున్నావంటు శైలంద్రని కోప్పడతాడు. ఆ తర్వాత వసుధార ఇచ్చిన ఐడియా బాగుంది.. దాన్ని ఫాలో అవుదామని ఫణింద్ర చెప్తాడు. మరొకవైపు మను దగ్గరికి శైలేంద్ర వెళ్లి ఇంకా రెచ్చగొట్టేలే మాట్లాడుతుంటాడు. అప్పుడే మహేంద్ర, వసుధారలు వెళ్లి శైలేంద్రపై కోప్పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |